మీకు అమ్మాయిలతో వీడియో కాల్ కావాలా. మీకు ఉన్న కోరికలు అన్నీ తీరుస్తారు. గంటకి 2000 రాత్రి అంతా అయితే 12000 ఇలా చాలా మెసేజ్ లు కొందరికి వస్తాయి. అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయమని ఉంటుంది. మీరు కంగారు ఆతృత కకృత్తితో కాల్ చేస్తే ఇక మీ పని గోవింద. వారు ఎవరు ఏమిటి అనేది తెలియదు. అమ్మాయిల పేరు చెప్పి డబ్బులు దోచేస్తారు.
ఇలాంటి కొందరు కేటుగాళ్లు నొయిడా , దిల్లిను తమ హబ్ చేసుకుని రెచ్చిపోతున్నారు. మీకు ఓ మెసేజ్ వస్తుంది. అక్కడ నుంచి వారి ట్రాప్ స్టార్ట్ అవుతుంది, ఎవరైనా వారికి ఫోన్ చేస్తే రెచ్చగొట్టేలా మాట్లాడతారు. ఇలా మాట్లాడి వాట్సాప్ కాల్ చేయమంటారు.
అక్కడ ఓ అమ్మాయి కనిపిస్తుంది, ఇక ఒక్కొక్క బట్ట తీస్తూ మీతో న్యూడ్ గా మాట్లాడుతుంది. మిమ్మల్ని న్యూడ్ గా నిలబెట్టి మాట్లాడుతుంది. అలా నిలబడిన సమయంలో మీ కాల్ రికార్డ్ చేస్తారు. దీంతో మీ జాతకం వారి చేతిలో ఉంటుంది. ఇక ఈ న్యూడ్ కాల్ తో మిమ్మల్ని బెదిరించి డబ్బులు గుంజేస్తారు. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి.