లైక్ చేసింది.. పాపం రూ.19లక్షలు పోగొట్టుకుంది

-

Vijayawada |రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారే కాదు ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగంతో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా విజయవాడ(Vijayawada)కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇలా పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకుంది. నగరానికి చెందిన ఓ యువతి టెక్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఓ రోజు ఆమె మొబైల్‌కు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చని ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె అందులో ఉన్న నెంబరుకు ఫోన్‌ చేయగా.. యూట్యూబ్‌లో వీడియోలను లైక్‌ చేస్తే డబ్బులు ఇస్తామని తెలిపారు. దీంతో డబ్బు వస్తుందని ఆశపడిన ఆమె తన బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చింది.

- Advertisement -

మొదట మూడు వీడియోలు లైక్‌ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150.. మరో ఆరు వీడియోలను లైక్‌ చేస్తే రూ.300 ఖాతాలో జమచేశారు. దీంతో ఆమెకు నమ్మకం కుదరడంతో పెట్టుబడి పెడితో లాభాలు వస్తాయని చెప్పడంతో యువతి అంగీకరించింది. అలా రూ.1000 చెల్లిస్తే తిరిగి రూ.1,600 ఆమెకు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.19లక్షలు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. అయితే లాభం వచ్చిన డబ్బును డ్రా చేసే అవకాశం లేకుండా చేశారు. దీనిపై ఆమె నిలదీయగా.. ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12,95,000 కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో కంగుతిన్న యువతి మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్నారు పోలీసులు. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Read Also: 
1. చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా: ఆనం
2. అలాంటి వారికే తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...