గ్రామ సచివాలయంలో ఘోరం..మైనర్ బాలికపై వాలంటీర్ ఘాతుకం

Village volunteer kills minor girl

0
79

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పరిపాలన కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి ఒడిగట్టింది వాలంటీరే కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దురాగతం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..నడుకూరు గ్రామానికి చెందిన బి.హరిప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే సచివాలయంలో వాలంటీరుగా పని చేస్తున్నాడు. గత నెల 31వ తేదీన తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడికి రాంబాబు అనే యువకుడు పూర్తి సహాయ సహకారాలు అందించాడు.

లైంగికదాడి తర్వాత ఆ బాలిక అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో నిందితులిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అయితే , తన చెల్లి కనిపించకపోవడంతో బాధితురాలి అక్క గ్రామంలో గాలిస్తూ సచివాలయానికి వచ్చింది.

అక్కడ అపస్మారక స్థితిలో పడి వున్న చెల్లిని చూసి బోరున విలపిస్తూ కేకలు వేసింది. ఆ తర్వాత దీనిపై తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.