Breaking: కలకలం..ఎమ్మార్వో ఆఫీస్ లో వీఆర్ఏ దారుణ హత్య

0
36

తెలంగాణలో వీఆర్‌ఏ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లోనే వీఆర్​ఏ దుర్గంబాబు హత్య జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కాగా  దుర్గంబాబు కొత్తపల్లి వీఆర్​ఏగా పని చేస్తున్నాడు. ఈరోజు సిబ్బంది ఆఫీస్ తెరవగా ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడిని వీఆర్​ఏ దుర్గం బాబుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరు హత్య చేసుంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.