ప్రేమోన్మాది ఘాతుకం… వరంగల్ లో అర్ధరాత్రి డబుల్ మర్డర్

-

వరంగల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది అతికిరాతకంగా నిద్రిస్తున్న కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే… వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం 16 చింతల తండాలో అర్ధరాత్రి డబుల్ మర్డర్ ఘటన కలకలం రేపింది. ప్రేయసిని తనకి దూరం చేశారన్న కోపంతో ఓ యువకుడు అర్ధరాత్రి ప్రియురాలి కుటుంబం పై దాడి చేశాడు. నిద్రిస్తున్నవారిని కత్తితో విచక్షణారహితంగా గాయపరిచాడు.

- Advertisement -

ఈ దాడిలో అతని ప్రియురాలి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి బానోతు శ్రీను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియురాలికి, ప్రియురాలు తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మేకల నాగరాజు అలియాస్ బన్నీ, చింతల తండాకు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. యువతి ఇంట్లో వీరి ప్రేమని అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి కొంతకాలం క్రితం ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. దీంతో పోలీసులు, పెద్దల సమక్షంలో వారిద్దరూ విడిపోయారు. ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారనే కోపంతో నిందితుడు బుధవారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు.

బాధితుల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కలవారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే అప్పటికే యువతి తల్లి మరణించగా, తండ్రి కొనఊపిరితో ఉన్నాడు. యువతికి, ఆమె సోదరుడికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి తండ్రి బానోతు శ్రీను పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు దుర్మరణం పాలవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. యువతి, ఆమె సోదరుడి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ, తల్లిదండ్రులను కోల్పోవడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ప్రస్తుతం నిందితుడు నాగరాజు అలియాస్ బన్నీ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bhatti Vikramarka | మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వారిదే: భట్టి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్బంగా...

Nayanthara | ‘నేనలాంటి వ్యక్తిని కాదు’.. ధనుష్‌తో వివాదంపై నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), నటుడు ధనుష్‌(Dhanush) మధ్య తీవ్ర వివాదం...