వర్షం కురిస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో – ఈ పెద్ద జంతువు వీడియో చూడండి

Watch this animal video on how to be careful when it rains

0
96

ఇది వానాకాలం ఎప్పుడు మబ్బు వేస్తుందో, ఎప్పుడు కుండపోత వర్షం కురుస్తుందో తెలియదు. అందుకే బయటకు వెళ్లిన సమయంలో మనం జాగ్రత్తగా గొడుగు తీసుకువెళ్లాలి. ఇక చాలా ప్రాంతాల్లో అల్పపీడనాలు తుఫానులు వల్ల బారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఏకంగా నాలాలు నిండుతున్నాయి అంతేకాదు నదులు ఉప్పొంగుతున్నాయి. రోడ్లు చూస్తే మొత్తం నీళ్లతో కనిపిస్తున్నాయి. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో బయటకు రావద్దు అని అంటున్నారు అధికారులు.

ఓ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్డంతా చెరువుని తలపించింది. స్థానికులు తెలిసిన రోడ్డు కదా అని దానిని దాటుతుండగా. అనుమానంతో అక్కడ చూడగా నీటిలో ఏదో పెద్ద ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. ఏమిటా అని చూశారు అంతే ఒక్క‌సారిగా షాక్ అది మొసలి.

భారీ వర్షాలు కురవడంతో ఎక్కడ నుంచి వచ్చిందో కాని ఈ మొసలి వచ్చి ఆ నీటిలో ఒక పక్కన ఎంచక్కా సేద తీరుతోంది. ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా ఆ మొసలిని కర్రతో బెదిరిస్తూ వ‌లకు చిక్కేలా చేశారు. ఈ వీడియో చూసిన అందరూ వర్షం పడితే ఎంత జాగ్రత్తగా ఉండాలో అని చెబుతున్నారు.

వీడియో చూడండి

https://www.instagram.com/p/CUGObQbFvL3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again