మనం చాలా రకాల గుడ్లు చూస్తాం. ఎక్కువగా కోడి గుడ్లు ఆహారంగా తీసుకుంటాం. ఇక అడవిలోకి వెళితే అనేక రకాల గుడ్లు కనిపిస్తాయి. నార్వేలో ఓ వ్యక్తి సాధారణ పక్షులకన్నా బలమైన, ఆస్ట్రిచ్ గుడ్డునొకదానిని సేకరించి ఆమ్లెట్ లా వండుకుని తినేశాడు. ఇది సాధారణ గుడ్డు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక దీనిని ఎంతో కష్టపడి అతను సంపాదించాడు. మనకు తెలిసిందే ఉష్ట్ర పక్షులు తమ గుడ్లను అతి పదిలంగా కాపాడుకుంటాయి.
అడవుల్లో వేట సాగించే ఈ వ్యక్తి అరుదైన ఈ గుడ్డును సేకరించాడు. ఇక అడవిలో దానిని ఎంచక్కా తిన్నాడు. పైన కారం ఉప్పు పెప్పర్ చల్లాడు. ఫైర్ కిచెన్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. దీనిని లక్షలాది మంది చూశారు. ఇక ఈ ఎగ్ ని చూసిన వారు ఇలాంటి ఎగ్ ఎక్కడా చూడలేదు అని అంటున్నారు.
ఇక ఇంత పెద్ద గుడ్డు రోజుకి ఒకటి తింటే సరిపోతుందా? ఇందులో మనకు ప్రొటీన్ అందుతుందా? అసలు ఇది మనం తినవచ్చా? ఇలా అనేక సందేహాలు అక్కడ యూజర్లు నెటిజన్లు కామెంట్ చేశారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
https://www.youtube.com/watch?v=DJoX9AL8eSA&t=66s