విషాదం: వాటర్‌ ట్యాంక్‌ గోడ కూలి చిన్నారి మృతి

0
102

తెలంగాణాలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శాతవాహన నగర్ లో తల్లితో పాటు వెళ్తున్న చిన్నారి దీత్యపై నీటి ట్యాంక్ గోడ కూలింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందడంతో..కన్నతల్లి రోదనతో శాతవాహన నగర్ మొత్తం నిండిపోయింది. అంతేకాకుండా  ఈ ప్రమాదంలో  రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.