Flash: మరి కాసేపట్లో పెళ్లి ముహూర్తం – వరుడు సూసైడ్

0
103

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో విషాదం చోటు చేసుకుంది. కాసేపట్లో పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించాల్సిన ఓ యువకుడు మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి జై ఆంధ్ర కాలనిలో ఆత్మహత్య చేసుకొని కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చాడు.

డీనేష్ అనే యువకుడి పెళ్లి ఈరోజు జరగాల్సి ఉండగా ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం సమాచారం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కె.జి.హెచ్ కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఆత్మహహ్యకు గల కారణం ఎంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.