కొన్ని ఘటనల గురించి వింటే నిజంగా షాక్ అవుతూ ఉంటాం. ఏదైనా ప్రమాదం జరిగి ఇలా వైద్యుల దగ్గరకు వెళ్లేవారిని చూస్తు ఉంటాం. అసలు ఏం జరిగింది అంటే చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని తైజౌకు చెందిన ఈ వ్యక్తి ఉదయం నిద్రలేచి పళ్లు తోముకుంటున్నాడు. ఇంకా మనోడు నిద్ర మత్తులో ఉన్నాడు. ఇక అలా మత్తులో బ్రష్ మింగేశాడట.
మింగిన బ్రష్ 15 సెంటీమీటర్ల పొడవు ఉంది.
గొంతులోకి వెళ్లిన టూత్బ్రష్ను బయటకు తీసేందుకు అతను ప్రయత్నించగా అది రాలేదు. వెంటనే కంగారు పడకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఎక్స్ రే తీసి అతని సమస్య చూశారు వైద్యులు. గ్యాస్ట్రోస్కోపిక్ శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. ఆపరేషన్ సమయంలో బ్రష్ను బయటకు తీసేందుకు వైద్యులు చాలా ఇబ్బందులు పడ్డారు.
చాలా సాఫ్ట్గా ఉన్న ఆ బ్రష్ హ్యాండిల్ను పట్టుకునేందుకు తంటాలు పడ్డారు. చివరకు కొన్ని గంటల పాటు కష్టపడి ఆబ్రష్ బయటకు తీశారు. ఇలా ప్రమాదవశాత్తు జరిగితే కంగారు పడకుండా వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి అని చెబుతున్నారు వైద్యులు. కొందరు ఏదో ఒకటి చేసి దానిని బయటకు తీయాలి అని ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల అన్నవాహిక తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు.