ఏలియ‌న్స్ రక్తం ఏ క‌ల‌ర్ లో ఉంటుంది – తాజా ప‌రిశోధ‌న‌ల్లో ఏమంటున్నారంటే

What is Aliens blood colour

0
88

ఈ విశ్వంలో మ‌నుషుల‌తో పాటు ఇంకా ఎవ‌రో ఉన్నారు అనే భావ‌న ఎప్ప‌టి నుంచో ఉంది. ముఖ్యంగా ఏలియ‌న్స్ గురించి నిత్యం ఎక్క‌డోచోట ఏదో ఒక‌టి వింటూనే ఉంటాం. అందుకే ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఏదైనా కొత్త వ‌స్తువు క‌నిపించినా గుర్తు క‌నిపించినా అది ఏలియ‌న్ గుర్తు అని భావిస్తారు. అందుకే దానిపై కూడా ప‌లు ప‌రిశోధ‌నలు జ‌రుగుతూనే ఉంటాయి.

గత కొన్నేళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో ఏలియన్స్‌ కచ్చితంగా ఈ ఆకారంలో ఉంటాయనో లేదా సినిమాలో చూపించిన విధంగా ఉంటాయన్న విషయంలో స్పష్టత లేదు. అయితే ఫోటోలు, కొన్ని ఆర్టులు, సినిమాలు చూసి ఇలా ఉంటారు అని మ‌నం ఊహించుకుంటున్నాం. అయితే మ‌న‌కు ర‌క్తం శ‌రీరంలో ప్ర‌వ‌హిస్తోంది. మ‌రి ఏలియ‌న్స్ కి ర‌క్తం ఉంటుందా? ఉంటే అది ఏ రంగులో ఉంటుంది. ఇది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

తాజాగా కొందరు శాస్త్రవేత్తలు మాత్రం, ఏలియన్స్‌ అచ్చం మనిషి ఆకారంలో ఉండే అవకాశం ఉందని, వారి శరీర రంగు మాత్రం కాస్త విభిన్నంగా ఉండచ్చని చెబుతున్నారు. వారు భిన్న వాతావ‌ర‌ణంలో ఉంటే వారి శ‌రీరం నీలిరంగు, ఇక ర‌క్తం ముదురు నీలం ఉండ‌వ‌చ్చు అంటున్నారు. ఇక ఆకుప‌చ్చ రంగు కూడా ఉన్నా ఆశ్చ‌ర్యం అక్క‌ర్లేదు అంటున్నారు.