ఆ ప్రాంతంలో తలలేని దెయ్యం తిరుగుతోందని ప్రజలు ఏం చేశారంటే

What people have done is that a headless ghost is roaming the area

0
109

సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డవలప్ అయినా ఇంకా కొందరు మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. దెయ్యాలు భూతాలను నమ్మేవారు చాలా మంది ఉన్నారు.ఇప్పటికీ దెయ్యాలు  కనిపిస్తాయని వాటి కోరికలు తీర్చుకోవడానికి తిరుగుతుంటాయని అంటుంటారు. ఏకంగా కొన్ని బిల్డింగుల్లోకి జనం కూడా ఎవరూ వెళ్లరు. ఏదైనా అంటే అక్కడ దెయ్యం ఉందని చెబుతారు.

అయితే ఏకంగా గ్రామాల్లో కూడా ఇలా దెయ్యాలు ఉన్నాయని ఖాళీ చేసిన వారు ఉన్నారు. ఇవన్నీ కేవలం మనుషులలో ఉండే అపోహాలు మాత్రమే అని కొందరు శాస్త్రవేత్తలు ఇలాంటివి కొట్టిపడేశారు. స్వాలా ఉత్తరాఖండ్ చంపపత్ జిల్లాలోని ఓ గ్రామం మొత్తం దెయ్యాల భయంతో ఖాళీ అయ్యింది. భూత్ విలేజ్ గా దీనిని పిలుస్తుంటారు.

ఉత్తరాఖండ్ లోని లాన్స్డౌన్ ప్రాంతంలో దెయ్యం తిరుగుతుందట. ఇది ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిమ్లా, ముస్సురీ పర్యాటకులు ఈ లాన్స్డౌన్ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ ఉదయం జనం తిరుగుతారు కాని రాత్రి 8.30 అయితే ఒక్కరు కూడా బయటకు రారు, ఎందుకంటే ఇక్కడ రాత్రి పూట తలలేని దెయ్యం తిరుగుతుందని చెబుతారు. 1893లో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ డబ్ల్యూ.హెచ్. వార్డెల్ ఇండియాకు వచ్చాడు. అతడు లాన్స్డౌన్ కంటోన్మెంట్ కామాండింగ్ ఆఫీసర్ గా
పనిచేశారు. ఆయన తర్వాత చనిపోయారు. కాని ఆయన శవం మాత్రం కనిపించలేదు. దీంతో ఆయన ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉంటుందని జనం నమ్ముతారు.