ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా మొరాదాబాద్లో ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వృద్ద జంటకి పెళ్లి చేశారు గ్రామస్తులు. అతని వయసు 60 ఏళ్లు. ఆమె వయసు 55 ఏళ్లు. ఇద్దరూ 20 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.
అదే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.
వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇక వీరి గురించి ఊరంతా అనేక రకాల పుకార్లు కామెంట్లు చేసింది. ఎవరు ఏమనుకున్నా వీరు కలిసే ఉన్నారు కాని వివాహం చేసుకోలేదు. చివరకు ఊరు పెద్దలు అందరూ పట్టుబట్టి పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే భరించి ఈ వృద్ధ జంటకి పెళ్లి చేశారు.
60 ఏళ్ల నారాయణ్ రాయ్దాస్, 55 ఏళ్ల రామ్రతీ కుమారుడు ఉండగా పెళ్లి చేసుకున్నారు, ఇక ఇన్నేళ్లు ఇలా అయిపోయింది. ఇక పిల్లవాడు ఎదుగుతున్నాడు కుమారుడికి అవమానం, అపనిందలు రాకూడదంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాల్సిందేనని గ్రామపెద్ద లు నిర్ణయించి పెళ్లి చేశారు. ఇక డీజే తో, పెళ్లి పాటలతో, ఊరు అందరూ స్టెప్పులేశారు వీరి వివాహానికి.