పక్కింటి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని యువకుడు ఏం చేశాడంటే

What the young man did was not give the girl phone number

0
287

పక్కింటి అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదని తుపాకీతో అమె ఇంటిముందు కాల్పులు జరిపాడు చాన్ బాషా అనే యువకుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె సమీపంలోని కడపనత్తం గ్రామంలో జరిగింది.

చాన్ బాషా ఫోన్ నెంబర్ అడగటంతో భయంతో ఆ యువతి ఇంట్లో వారికి తెలిపింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో చాన్ బాషా ను కుటుంబం సభ్యులు, ఊరిపెద్దలు హెచ్చరించారు.

పెళ్ళి చేసుకునే అమ్మాయి ముందే తనను కోట్టారని …అ అమ్మాయి కుటుంబ సభ్యులపై కోపంతో యువతి ఇంటి ముందు నాటు తుపాకితో రెచ్చిపోయాడు చాన్ బాషా.

ఇంట్లో వారు ప్రశ్నించడంతో తుపాకితో కాల్పులు జరిగిపాడు. బుల్లెట్ మిస్ అయ్యి..పక్కింటి తలుపులు ధ్వంసం అయినాయని బాధితులు తెలిపారు.

భయంతొ రాత్రంతా ఇంట్లోనే ఉండి ఉదయం పోలీసులను ఆశ్రయించారు యువతి కుటుంబం సభ్యులు, గ్రామస్థులు.

పోలీసులు చాన్ బాషా ను అదుపులోకి తీసుకున్నారు.