ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి తెలియకుండా వారి అకౌంట్ల నుంచి నగదు వాడుతున్నారు.
ఈ ఆటల మోజులో పడి ఇళ్లును గుల్ల చేస్తున్నారు. నగదు కట్ అవ్వడంతో పోలీసులకి పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో అసలు ఏమైందా అని తెలుసుకుంటే , వారి నగదు ఇలా గేమ్స్ కోసం వాడారు అని తెలిసి షాక్ అవుతున్నారు. ఏకంగా లక్షల రూపాయల నగదు వాడిన వారు చాలా మంది ఉన్నారు.
కొందరు పిల్లలు ఇలా ఆన్లైన్ గేమ్స్కు బానిసలుగా మారి. సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.
కోజికోడ్కు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వారి తండ్రి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక తల్లితో పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. ఈ కరోనా వల్ల ఆన్ లైన్ తరగతుల కోసం వారికి మొబైల్- ట్యాబ్ కొన్నారు పేరెంట్స్. అయితే వీరు ఇందులో పబ్ జీ గేమ్ కూడా ఆడుకుంటున్నారు.
ఇద్దరూ పిల్లల్లో ఒకరు తొమ్మిదో తరగతి చదువుతుండగా, మరొకరు పదవ తరగతి చదువుతున్నారు. ఈ పబ్ జీ ఆటలో భాగంగా నెక్ట్స్ లెవల్కి చేరడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వీరు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాస్ వర్డ్ లు తెలుసుకుని సుమారు లక్ష రూపాయల వరకూ వాడేశారు. ఇక ఈ విషయం తెలియక తన డబ్బులు పోయాయి అని వారి తల్లి సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది. వారు విచారణ చేస్తే ఈ పిల్లలు గేమ్ కోసం లక్ష రూపాయలు వాడారు అని తేలింది. ఈ విషయం తెలిసి ఆమె షాక్ అయింది.