ఆమె, ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు, తర్వాత ఏమైందంటే?

0
117

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు అనుమానం వచ్చి పలుమార్లు నిలదీశాడు. అదేం లేదంటూ భర్తను బుకాయించింది. ఇక లాభం లేదనుకున్న భర్త వారి ఇల్లీగల్ ఎఫైర్ ను బయటపెట్టేందుకు కాపు కాశాడు. వారిద్దరూ గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో శనివారం జరిగింది. మరిన్ని వివరాలు… భైంసాలో ఉండే రాజు ఒక షాప్ లో పనిచేస్తున్నాడు. ఇదే పట్టంలోని ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల క్రితం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో గత మూడేళ్లుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.

గత కొంత కాలంగా రమేష్ అనే వ్యక్తితో ఆ యువతి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. శనివారం నాడు వారిద్దరూ ఒక గదిలో ఉండగా రాజు అక్కడికి వెళ్లి ఆ ఇంటి గదికి బయటనుంచి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో షాక్ కు గురైన ఆ యువతి, ఆమె ప్రియుడు గది లోపలి నుంచి గడియ పెట్టుకుని నాలుగు గంటల పాటు గదిలోనే ఉన్నారు.

చివరకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో ఐదు గంటల తర్వాత రూమ్ నుంచి బయటకొచ్చారు. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భైంసా టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ మీడియాకు తెలిపారు. పోలీసులు ఏరకమైన కేసులు నమోదు చేశారన్నది ఇంకా తెలియలేదు.