బిలాస్ నగర్ కు చెందిన పాండిరాజ్ జూదం ఎక్కువగా ఆడుతూ ఉంటాడు, కర్రల కొట్టులో పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. కానీ మూడు సంవత్సరాలుగా ఈ జూదం మరింత ఎక్కువ ఆడుతూ భార్య నగలు కూడా అమ్మేశాడు.
అయితే ఈ కరోనా లాక్ డౌన్ వేళ పని కూడా లేకపోవడంతో పేకాట మరింత ఎక్కువగా ఆడుతున్నాడు. ఇక తెలిసిన వ్యక్తి దగ్గర అప్పుచేశాడు. ఈ అప్పు నెలలో ఇవ్వకపోతే నా భార్యని నీకు అప్పగిస్తా అని రాసి ఒప్పంద పత్రం ఇచ్చాడు వడ్డీ వ్యాపారికి… దీంతో ఆ వ్యాపారి అతనికి 20 వేలు అప్పు ఇచ్చాడు.
నెల రోజులు అవ్వడంతో వ్యాపారి నగదు అడిగాడు, నా దగ్గర డబ్బు లేదు భార్యని తీసుకుపో అని చెప్పాడు, దీంతో తన మనుషులతో అతని భార్యని తీసుకువెళ్లడానికి వచ్చాడు… వెంటనే జరిగిన విషయం ఆమెకి చెప్పి నాతో రావాలి అని వడ్డీ వ్యాపారి కోరాడు. దీంతో ఆమె నేను తప్పకుండా వస్తాను కాని నా బిడ్డలని మా పుట్టింట్లో అప్పగించి సాయంత్రం వస్తాను అని చెబుతుంది… ఆమె మాటలు నమ్మి అతను వెళ్లిపోతాడు. భర్త చేసిన దారుణమైన పనికి ఆగ్రహంతో ఆమె తన సోదరుడితో కలిసి భర్త, వడ్డీ వ్యాపారిపై కేసు పెట్టింది, వెంటనే పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.