వివాహామై 45 రోజులు – భర్త నుంచి విడాకులు కోరిన భార్య : ఎందుకంటే?

0
128

బిహార్ లో పెళ్లయిన 45 రోజులకే ఓ నవవధువు భర్త నుంచి విడాకులు కోరింది. ఇటు బంధువులు పెళ్లికి వచ్చిన వారు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. విడాకులు ఇప్పించండి లేదంటే నాకు ఆత్మహత్య శరణ్యం అని తెలిపింది. ఇక 45 రోజుల్లో ఈ జంట మధ్య ఏమైంది అనేది చూస్తే.

జహంగీరా గ్రామానికి చెందిన నేహా కుమారి అనే యువతి 12వ తరగతి వరకూ చదువుకుంది.
ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తిడితో సునీల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఇక 45 రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు అత్తింటివారు.

మరి ఆమె తన బాధ ఏమని చెబుతోందంటే, తనకు పెద్ద చదువులు చదవాలని ఉందని తల్లిదండ్రులుగానీ, అత్తమామలుగానీ తన మాటలు వినడం లేదని అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయాను అని చెప్పింది.అత్తారింట్లో నాకు ఊపిరి సలపడం లేదని ఏడ్చేసింది. ఇక ఇరు కుటుంబాలు మాత్రం ఆమెకి సర్దిచెప్పాయి అయినా ఆమె వినలేదు చివరకు విడాకులకి అప్లై చేసింది.