ఈ బిడ్డ నాకు పుట్టలేదంటూ కోర్టుకు వచ్చాడు ఓ భర్త. అందరికీ డీఎన్‌ఏ పరీక్ష చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. ఇక అతనికి పెద్దలు వివాహం చేశారు. 2006 మే 5వ తేదీ వివాహమైంది. ఇక సెలవులపై వచ్చిన అతను మళ్లీ ఆర్మీలో ఉద్యోగానికి వెళ్లాడు కేవలం 22 రోజులు ఇంటిలో ఉన్నాడు.
2007 మార్చి 9వ తేదీన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అతను చెప్పేది ఏమిటి అంటే ?అసలు వివాహం అయిన తర్వాత రోజు నుంచి నేను నా భార్యతో కలవలేదు సంసారం చేయలేదు.
డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా కలవకపోయినా బిడ్డ పుట్టడంపై అనుమానం వ్యక్తం చేశాడు.
విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
ఇక్కడ మరో విషయం చెప్పాడు తనకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని వైద్యులు చెప్పారని, తనకు పిల్లలు కలగరని వైద్యులు చెప్పారని సర్టిఫికెట్ కూడా చూపించాడు. భార్యపై ఆరోపణలు చేశాడు. నా భార్యకు ఆమె సోదరి భర్తతో వివాహేతర సంబంధం ఉందని, అతడి వలన నా భార్యకు కొడుకు పుట్టాడు అని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. చివరకు డీఎన్ ఏ పరీక్షకు కోర్టు అనుమతి ఇచ్చింది.