చికెన్ కూర కోసం భార్య భర్త గొడవ -చివరకు దారుణం

Wife quarrels with husband over chicken curry

0
97

వినడానికి చాలా దారుణమైన ఘటనలు ఇవి. చిన్న చిన్న విషయాలకు వివాదాలు గొడవలు పెట్టుకుంటున్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు. చివరకు విడాకులు తీసుకుంటున్న జంటలు కొన్ని చూస్తున్నాం. ఇటీవల ఆ కోపం ఆక్రోశంలో కొందరు భార్య భర్తలు హత్యలకు పాల్పడుతున్నారు. ఒకరిని ఒకరు కోపంతో చంపుకుంటున్నారు ఇక్కడ ఇలాంటి దారుణం జరిగింది.

మధ్యప్రదేశ్లోని షాదోల్ జిల్లా సెమారియతోల గ్రామంలో దారుణం జరిగింది. ఆగస్టు 23న కమలేశ్ కోల్ భార్య రామ్బాయ్ కోల్ను చికెన్ వండమని కోరాడు. కాని ఆమె నేను వండను అని చెప్పింది. ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. దీంతో వెంటనే అతను భార్య తలపై కర్రతో కొట్టాడు.

అక్కడికక్కడే ఆమె స్పాట్లోనే మృతి చెందింది. చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకు ఇంత దారుణం చేశావు అని భర్తని ప్రశ్నిస్తే, చికెన్ వండేందుకు నిరాకరించడం వల్లే భార్యపై దాడి చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. చికెన్ కోసం ఏకంగా నిండు ప్రాణం బలైపోయింది.