తెలంగాణాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిండునూరేళ్ళు భర్త చల్లగా ఉండాలనుకునే భార్యలు ఉన్న ఈ రోజుల్లో ఓ మహిళా మాత్రం కట్టుకున్న భర్తనే చంపుదామని చూసింది. హన్మకొండ పసరగొండలో కట్టుకున్న భర్తనే బ్లేడుతో గొంతు కోసి దారుణ హత్య చేసింది. అది గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.