చిరుత నుంచి తప్పించుకున్న అడవి పంది – ఎంతో తెలివైంది వీడియో చూడండి

Wild boar escaping from a leopard

0
105

పులితో సింహంతో వేట ఆట చాలా డేంజర్ . ఇక అడవిలో అవి ఎలా ఉంటాయో తెలిసిందే. వాటికి ఆకలి వేసి ఆహారం కోసం ఎదురుచూస్తే ఎంతటి జంతువు అయినా వాటికి ఆహారం అవుతుంది. అయితే ఒక్కోసారి చిన్న జంతువులు కూడా వాటి నుంచి తప్పించుకుంటాయి. బతుకు జీవుడా అని పారిపోతాయి. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో కూడా మనం చాలా చూశాం.

చెప్పాలంటే వేటలో చిరుత ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటుంది. టార్గెట్ పెట్టింది అంటే దానికి దెబ్బలు తగిలినా విశ్రమించకుండా వేటాడి చంపేస్తుంది. తాజాగా చిరుతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలామంది ఆ పారిపోయిన జీవిని లక్కీ అంటున్నారు.

అడవిలో చిరుతపులి తన ఎర కోసం చెట్టుపై మాటు వేసి ఉంది. అక్కడకు ఓ అడవి పంది వస్తుంది. చెట్టుపై ఉన్న చిరుత మెల్లగా పంజా విసరడానికి ఎదురుచూస్తుంటుంది. చిరుత వాసన గమనించిన అడవి పంది దానిని చెట్టుపై ఉన్నట్లు గుర్తిస్తుంది. వెంటనే పారిపోతుంది. ఇక పులి అక్కడ నుంచి నెమ్మదిగా కిందకి దిగుతుంది. ఈలోపు పంది పరుగున వెళుతుంది.
ఆ అడవి పంది కళ్ళు, ముక్కు, చెవులు బాగా పనిచేశాయి అందుకే చిరుత నుంచి తప్పించుకుంది అంటున్నారు నెటిజన్లు.

వీడియో చూడండి.

https://www.instagram.com/p/CR8ZDOnJGLv/