నువ్వు హిజ్రాగా మారితే పెళ్లాడతా – హిజ్రాగా మారిన ఆమెకి షాకిచ్చిన మహిళ

Will you get married if you become a Hijra?

0
126

నువ్వు హిజ్రాగా మారితే నిన్ను పెళ్లి చేసుకుంటా అని మహిళ చెప్పింది. దీంతో ఆ యువతి కూడా హిజ్రాగా మారింది. కానీ కొద్ది కాలానికి ఆమెని వదిలేసింది ఆ మహిళ. ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఈ దారుణ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు అధికారులు.
ఆమె శిక్షణ తీసుకుంది. ఈ సమయంలో ఆమెకి ఓ మహిళ పరిచయం అయింది.

ఇద్దరికి వివాహం కాలేదు. దీంతో ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆ యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది. దీంతో ఆమె హిజ్రాగా మారింది. ఇద్దరు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ హిజ్రాని వివాహం చేసుకోను అని ఆ మహిళ చెప్పింది.

వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు తనని మోసం చేసిందని, తనకు న్యాయం చేయాలని యువతి కడప జిల్లా పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.