భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వివాహిత మృతి చెందింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండల కేంద్రంలోని భవాని నర్సింగ్ హోమ్‌లో ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని చేరింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉందని చెప్పారు. దీంతో ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. అనంతరం ఆపరేషన్ చేసి కణితి బయటకు తీశారు. అనంతరం ఆమెను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనంతరం యూరిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చి పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.