Woman fakes death :పోలికలతో ఉన్న యువతిని చంపి.. ప్రియుడితో జంప్‌

-

Woman fakes death by killing onther woman: తన పోలికలతో ఉన్న యువతిని చంపేసి.. తనే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించిందో కిలాడీ. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన పాయల్‌ భాటి(22) అజయ్‌ ఠాకూర్‌ అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. పాయల్‌ భాటి ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోరన్న భయంతో, భయంకమైన ప్లాన్‌ వేసింది.

- Advertisement -

పాయల్‌ పోలికలతో ఉన్న హేమ అనే యువతి స్థానికంగా ఓ మాల్‌లో పని చేస్తోంది. హేమను చంపేసి.. తానే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి, ప్రియుడితో పారిపోవాలని పాయల్‌ ప్లాన్‌ వేసింది. పథకం ప్రకారం హేమతో స్నేహం చేసి.. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారిద్దరినీ హేమ నమ్మిందని రూఢీ చేసుకున్న తరువాత, ప్లాన్‌ ప్రకారం, పాయల్‌ హేమను ఇంటికి పిలిచి.. ప్రియుడితో కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసింది.

గొంతు నులిమి ఆనవాళ్లు కనిపించకుండా వేడి నూనె ముఖం, గొంతుపై పోసింది. మృతదేహానికి తన దుస్తులు తొడిగి, చేతికి గాట్లు పెట్టింది. వంట చేస్తుండగా నా ముఖం కాలిపోయింది. నాకింక బతకాలని లేదు అంటూ ఓ సూసైడ్‌ నోట్‌ రాసి, తానే ఆత్మహత్య చేసుకున్నట్లు (Woman fakes death) చిత్రీకరించింది పాయల్‌. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌, మృతదేహంపై ఉన్న బట్టల ఆధారంగా చనిపోయింది పాయల్‌ అని భావించి.. ఆ మృతదేహానికి పాయల్‌ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

తమ కుమార్తె కనిపించటం లేదంటూ హేమ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాయల్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బంధువులను చంపటం కోసమే.. హేమను చంపినట్లు పాయల్‌ పోలీసులకు వివరించింది. తన తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారనీ.. అందుకు తన సోదరుడి అత్తింటివారితో పాటు, ఓ బంధువు కారణమని పాయల్‌ తెలిపింది. తన తల్లిదండ్రుల మృతికి కారణమైన వారిని చంపటం కోసం.. తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించినట్లు వివరించింది. అనంతరం వారిని హత్య చేసేందుకు నాటు తుపాకీ, కత్తిని కొనుగోలు చేసినట్లు పాయల్‌ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...