చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు గొడవ పడుతూ ఉంటారు. చిన్న చిన్న గొడవలు ఏకంగా హత్యలు ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. ఇక్కడ ఏకంగా ఈ భార్య భర్తల మధ్య చిన్న విషయం చివరకు పెను ఘటనకు దారితీసింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ దారుణ ఘటన జరిగింది. షోలాపూర్కు చెందిన గహినీనాథ్ సర్వదేకి, ప్రతీక్ష అనే మహిళకు 2019లో వివాహం జరిగింది.
వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గహినీనాథ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గహినీనాథ్, ప్రతీక్ష మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వీరి కుటుంబం పూణెలో ఉంటోంది. ఓరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా భార్యా, పిల్లల కోసం పానీ పూరిని పార్సల్ తీసుకువచ్చాడు.
అయితే, తనకు చెప్పకుండా పానీపూరి తేవడంపై ప్రతీక్ష ఆగ్రహం వ్యక్తం చేసింది. పానీ పూరీ ఎందుకు తీసుకువచ్చావంటూ గహినీనాథ్తో గొడవ పెట్టుకుంది. అది ఆమె తినలేరు. ఇక తర్వాత రోజు అతను ఆఫీసుకి వెళుతుండగా అతనికి టిఫిన్ కూడా పెట్టలేదు. చివరకు ఆఫీసుకి వెళ్లిన తర్వాత విషం తాగింది. అది గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రతీక్ష ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.