వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన పాము- ఎంత కాలం బతికిందంటే

గ్యారీ అనే పాము పేరుమీద జీవిత రికార్డు నమోదైంది

0
115

ఈ భూమిమీద అనేక రకాల పాములు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ పాముల్లో చాలా వరకూ విషం లేనివి ఉన్నాయి. ఇక మరికొన్ని విషంతో ఉండేవి ఉంటాయి. అందుకే ఏ పాముని చూసినా చాలా మంది భయంతో వణికిపోతారు. ఇక పాములు పగ పడతాయని కూడా చాలా మంది నమ్ముతారు. కాని నిపుణులు మాత్రం పాములు పగపట్టవు అంటారు.

అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో పాములని ఇంట్లో పెట్స్ లా పెంచుకుంటారు. ఎక్కువ కొండచిలువలను పెంచుకునే వారిని మనం చాలా మందిని చూశాం. ఇక ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన పాము ఏమిటో తెలుసా.

పాముల సగటు జీవితం 10 నుంచి15 సంవత్సరాలు మాత్రమే. కానీ గ్యారీ అనే పాము పేరుమీద జీవిత రికార్డు నమోదైంది. గ్యారీ అనే బాల్ పైథాన్ పాము 42 సంవత్సరాలు జీవించింది. ఈ పామును ఒక మహిళ పెంచుకుంది. ఇప్పటి వరకూ ఇంత ఎక్కువ కాలం ఏ పాము బతకలేదు. ఇది వరల్డ్ రికార్డ్.