ఈ చింపాజీ కృతజ్ఞతా భావం చూస్తే వావ్ అనాల్సిందే -వీడియో వైరల్

Wow analsinde if you look at this chimpanzee's sense of gratitude

0
84

కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ఎంతో గొప్ప లక్షణం. ముఖ్యంగా మనుషులే కాదు జంతువులు కూడా ఈ సమయంలో ఒకరికి మరొకటి సాయం చేసుకుంటాయి. ముఖ్యంగా నోరు లేని మూగ జీవాలు కూడా తమ ప్రాణాలు కాపాడినవారికి తమ దాహం తీర్చినవారికి, తమకు ఆహారం పెట్టి కడుపు నింపినవారి పట్ల కృతజ్ఞతలు తెలిపిన సందర్భాలు ఎన్నో మనం చూశాం. సోషల్ మీడియాలో ఇలాంటివి కొన్ని వందల వీడియోలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఇక్కడ అలాంటిదే జరిగింది. ఓ చింపాంజీ తనను కాపాడివారిని కృతజ్ఞతలు చెప్పిన విధానం చూస్తే. మనలో కూడా ఇంత కృతజ్ఞతాభావం ఉండదేమో అనిపిస్తుంది. ఇక్కడ వీడియోలో ఓ చింపాంజీ తనను కాపాడినవారిని కౌగలించుకుని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల పటాలజిస్ట్ జేన్ గూడాల్ బృందం వేటగాళ్లు పన్నిన ఉచ్చులో పడిన ఓ చింపాంజీని కాపాడారు. దాన్ని బోనునుంచి విడుదల చేశారు. అది బయటకు వచ్చి పరిసరాలు చూసుకుని తనకు సాయం చేసిన వారికి దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది.ఇలా కృతజ్ఞతాభావం తెలిపింది.

వీరు ఈ వీడియో చూడండి

https://twitter.com/SudhaRamenIFS/status/1415291645390581760