అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య..సెల్ఫీ వీడియో తీసి మరీ!

Young man commits suicide after cheating on girl

0
99

అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ఈ దారుణం వెలుగు చూసింది.

అమ్మాయి చేసిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుండి డబ్బులు… బంగారం… బట్టలు తీసుకుందని యువకుడి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తన సూసైడ్ సంబంధించిన వీడీయోను పంపేందుకు గత రాత్రి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లని యువకుడు క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో  ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నా అంటూ సెల్ఫ్ వీడియో తీసి ఉరి వేసుకున్నాడు. గతంలోనే ఈ యువకుడికి పెళ్ళైనట్టు, భార్యతో విడిపోయినట్టు తెలుస్తోంది.