ప్రాంక్ చేసి భయపెట్టినందుకు యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష – జర జాగ్రత్త

Young man sentenced to two years in prison for frank and intimidation

0
77

ఈ మధ్య కొందరు ప్రాంక్ వీడియోలు ఎక్కువుగా చేస్తున్నారు. వీటి వల్ల కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఫ్యామిలీల మీద స్నేహితుల మీద రిలేషన్స్ పై ఇలా చాలా మంది ప్రాంక్ లు చేశారు. అయితే ఇది మన తెలుగు స్టేట్స్ లో కూడా జరుగుతోంది. మరీ మితిమీరితే పోలీసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.
కొందరు పాపులర్ అయ్యేందుకు ఈ ప్రాంక్ కాన్సెప్ట్ లు చేస్తున్నారు.

ఇలా ప్రాంక్ అని చెప్పి ఇతరులను ఇబ్బందులకు గురి చేసిన ఓ యువకుడిని జైల్లో పెట్టారు పోలీసులు. రష్యాలో కారోమాటులో నుంచి ఝూబోరోవ్కు వెళ్తున్న మెట్రో ట్రైన్లో ఓ యువకుడు ఎక్కాడు. జనంతో అన్నీ బోగీలు రద్దీగా ఉన్నాయి.
ఒక్కసారిగా విపరీతంగా దగ్గుతూ గుండెపట్టుకుని కింద పడిపోయాడు. ఇక కరోనా భయంతో అందరూ షాక్ అయ్యారు. త‌ర్వాత స్టేష‌న్లో రైలు ఆగింది అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు.

ఇదంతా ప్రాంక్ అంటూ ఆ యువకుడు సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చివరకు ఇది అధికారుల దగ్గరకు వెళ్లింది. అతనిని పట్టుకుని పోలీసులు విచారించారు .యువకుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.