విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ పై యువకులు రెచ్చిపోతున్నారు. పుల్సర్ 220, KTM బైక్ లతో యువకులు ఇష్టారాజ్యంగా విన్యాసాలు చేస్తున్నారు. నడిరోడ్డుపై బైక్ పై నిలబడి గన్ తో స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వారి విన్యాసాలతో మిగతా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి