ఏపీలో దారుణం..ప్రేమ పేరుతో ఎస్సై మోసం చేసాడని యువతీ ఆత్మహత్య

0
134

దేశంలో ఇప్పటికే ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులు మోసపోయి తమ ప్రాణాలను తామే బలితీసుకున్న సంఘటనలు ఎన్నో చూసాము. తాజాగా ఏపీలో ఓ దుర్మార్గుడి వలలో పడిన యువతీ మోసపోయిందని పసిగట్టి ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళ్ళితే..అనంతపురం జిల్లా పామిడి మండలం కొట్టాల గ్రామంలో ఎస్సై విజయ్ కుమార్ చేసిన పనికి నిండు ప్రాణం బలయిపోయింది. ఇద్దరు యువతులతో ప్రేమవ్యవహారం నడిపి చివరకు ఒక్క యువతిని వివాహం చేసుకున్నాడు. అది తెలిసిన మరో యువతీ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పురుగులమందు తాగింది.

పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు యువతిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. ఆ యువతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. యువతి మృతికి కారణమైన ఎస్సై ని పోలీసులు కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.