టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై యువతి ఫిర్యాదు

Young woman complains about son of former TRS MLA

0
88

తెలంగాణ: టిఆర్ఎస్ వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కొడుకు బానోతు మృగేందర్ తనని మోసం చేశాడంటూ ఓ యువతి‌ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు మృగేందర్. బ్రదర్ ను అవుతానంటూ ఫేస్ బుక్ లో యువతిని పరిచయం చేసుకున్న బానోతు మృగేందర్. ఆ తర్వాత ప్రేమ పేరుతో యువతికి దగ్గరయ్యాడు. యువతిపై తన రూమోలోనే లైంగిక దాడి చేసినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

పెళ్లి చేసుకోమంటే మృగేందర్ ముఖం చాటేస్తున్నట్లు తెలిపింది. అంతే కాదు బాధితురాలిని మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ పలుమార్లు బెదిరించినట్లు ఫిర్యాదులో బయటపడింది. తన కొడుకును మరిచిపోకపోతే చంపేస్తానని యువతిని బానోతు మదన్ లాల్ బెదిరించినట్లు యువతి ఆరోపిస్తుంది. ఇక బెదిరింపులు తాళ లేక కూకట్ పల్లి పిఎస్ లో గత నెల 27న యువతి‌ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.