లేడీస్ హాస్టల్ భవనంపై నుండి పడి రేవతి అనే యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా హాస్టల్ లో కనీస భద్రతా చర్యలు లేవని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.