పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది – బిడ్డ పుట్టాక ఎంత దారుణం చేసిందంటే

Young woman have pregnancy with out marriage

0
104

కొందరు పెళ్లికి ముందే గర్భం దాల్చుతారు. ఇలాంటి వారు ప్రేమలోని లేదంటే మోసపోయి ఇలా గర్భవతులు అవుతారు. అలాగే కర్ణాటకలో ఓ యువతి అక్రమ సంబంధంతో గర్భం దాల్చింది. తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆ బిడ్డను కిటికి నుంచి విసిరేసింది, దీంతో ఆ బిడ్డ చనిపోయింది ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది.

హెసరఘట్టకు చెందిన యువతి అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. ఆమె ప్రియుడు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి జాయిన్ చేశాడు. చివరకు బిడ్డకి జన్మనిచ్చింది. తర్వాత ఆ పసికందును కిటికి నుంచి విసిరి పారిపోయింది. వెంటనే సిబ్బంది ఆమెని పట్టుకున్నారు. పోలీసులకి సమాచారం ఇచ్చారు దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

యువతి ఇలా గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ జంటపై కేసు నమోదు చేశారు. వీరిద్దరూ ప్రేమించుకుని శారీరకంగా దగ్గర అయ్యారు దీంతో ఆమె గర్భవతి అయింది. ఈ ఘటన గురించి తెలిసి కుటుంబ స‌భ్యులు విచారించారు. వీరి ఆనందాల కోసం చివరకు ఆ పసికందుని బలిచేశారు అని విమర్శిస్తున్నారు.