హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో యువతి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. పెళ్ళికి నిరాకరించిందని ప్రియుడు శ్రీశైలమే ఆమెను చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముందుగా ప్లాన్ ప్రకారం ఆమెను కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశాడు. అంతేకాదు ఆ యువతి మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. పోలీసులు యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. తమ కూతురు డెడ్ బాడీని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.