Flash: సిద్దిపేట జలాశయంలో ఈతకు వెళ్లి హైదరాబాద్‌ యువకులు గల్లంతు

0
127

ప్రస్తుతం వేసవికాలం కావడంతో పాఠశాలలు లేక బాలురు ఈతకు సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ ఆనందం కోసం వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన బాలురు సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే  సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో చోటుచేసుకుంది.

జలాశయంలో ఈత కోసం దిగిన ఆ యువకులు లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి అరుస్తుండగా..అది గమనించిన స్థానికులు జలాశయం వద్దకు చేరుకునే లోపే ఇద్దరు కనపడకుండా పోయారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని గల్లంతయినవారిని అక్షయ్ వెంకట్, రాజన్ శర్మ గుర్తించడంతో పాటు హైదరబాద్ నగరానికి చెందినట్టు నిర్దారించారు. ప్రస్తుతం బాలురు కోసం స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.