వైసీపీ అసమ్మతి నేత దారుణ హత్య

-

సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణా రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారం పొడి చల్లి, వేట కొడవళ్లతో పాశవికంగా దాడి చేసి 18 చోట్ల దారుణంగా నరికారు. వివరాల్లోకి వెళ్తే, రామకృష్ణా రెడ్డి సొంత గ్రామమైన చౌళూరు సమీపంలోని కర్ణాటక సరిహద్దులో ఓ ధాబా నిర్వహిస్తున్నారు. ఎప్పట్లా శనివారం రాత్రి కూడా ధాబాను మూసివేసి, కారులో ఇంటికి వచ్చారు. అప్పటికే రామకృష్ణ కోసం మాటు వేసి ఉన్న దుండగలు.. కారు దిగుతున్న అతడిపై కారం చల్లారు. వెంటనే వేట కొడవళ్లతో దాడికి చేసి, పరారయ్యారు. తీవ్రగాయాలతో రక్తమోడుతున్న రామకృష్ణారెడ్డిని స్థానికులు హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.

- Advertisement -

మాస్కులు ధరించిన ఐదుగురు దుండగులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చారనీ.. ఇద్దరు వాహనాలపై కూర్చొని ఉండగా ముగ్గురు దాడి చేసి, రామకృష్ణారెడ్డిని హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్‌, హిందూపురం రూరల్‌ సీఐలే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తల్లి లక్ష్మీనారాయణమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఆగస్టు 15న జెండా ఎగురవేసే విషయంలో ఎమ్మెల్సీ వర్గీయులకు, రామకృష్ణా రెడ్డి మధ్య పెద్ద వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ వర్గీయులు రామకృష్ణారెడ్డిని చంపుతామని బెదరించటం, ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరగటం, స్థానికంగా సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...