బాస్ తో ఆమె అఫైర్ – భర్తపై దారుణమైన స్కెచ్

Her affair with the boss-Outrageous sketch on husband

0
356

అక్రమ సంబంధాలతో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ క్షణిక సుఖాల కోసం ఏకంగా హత్యలకు కూడా తెగబడుతున్నారు. తాజాగా ఓ భార్య తన బాస్ తో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తని చంపాలి అని స్కెచ్ వేసింది. అయితే అతను తప్పించుకోవడంతో భార్య బండారం బయటపడింది.

నెలమంగలలో భార్యాభర్తలు కాపురం ఉంటున్నారు. అతని భార్య ఓ లారీ షోరూమ్ లో పనిచేస్తోంది. అక్కడ యజమానితో ఆమె అఫైర్ పెట్టుకుంది. ఆ షోరూం యజమాని తో కలిసి ఆమె బయటకు షికార్లకు వెళ్లేది. భర్తకు తమపై అనుమానం వస్తుంది అని భయపడి ఎలాగైనా భర్తని అడ్డు తొలగించుకోవాలి అని స్కెచ్ వేసింది.

యజమాని నలుగురు మనుషులను ఏర్పాటు చేసి ఆమె భర్తను చంపేయాలని రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చాడు. కాని భర్త వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారించారు. అయితే భార్య ఆమె యజమాని ఈ స్కెచ్ వేశారు అని తెలిసింది. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.