శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

0
337

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన శ్రీనివాస్‌, అమరగొండ శ్రీనివాస్‌ అనే ఇద్దరు ప్రయాణికుల నుంచి 388 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న బంగారం విలువ రూ.6,15,519 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.