లక్ష్మీ కటాక్షం కోసం పౌర్ణమి రోజు ఇలా చేయండి

-

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో వివరించబడింది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లలో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతనే రాత్రి భోజనం తీసుకోవాలి. ఇలా పూజ చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం పొంది ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...