తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం

-

KVR Jewellers Owner Donates Gold Ornaments to Tirumala Srivaru: చిత్తూరులోని కెవిఆర్ జ్యూవెలర్స్ వ్యవస్థాపకులు శ్రీ కెఆర్.నారాయణమూర్తి, వారి సతీమణి శ్రీమతి కె.ఎన్ స్వర్ణగారి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీవైవి సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్ఎస్) శ్రీ అనిల్ కుమార్ సింఘాల్కు అందించారు. దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు…

- Advertisement -

వీటిలో మూలవిరాట్ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. కాగా, ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ప్రభాస్ ఆరోగ్యంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...