Lunar eclipse: రేపే చంద్రగ్రహణం.. మూతపడనున్న ఆలయాలు

-

Lunar eclipse in telugu states: రేపు (నవంబర్‌ 8న) ఏర్పడబోయే చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో చివరిది. కాగా, 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు ఏర్పడటం అనేది ఎంతో అరుదుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. పురోహితులు, పండితులు మాత్రం అపశకునంగా భావిస్తున్నారు. రాబోయే ఆపదకు ఇదే సూచక అని హెచ్చరిస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాలన్నీ మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రముఖ ఆలయాల ఈవోలు ప్రకటించారు. చిన్నచిన్న ఆలయాలు సైతం మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల పూజారులు వెల్లడించారు.

- Advertisement -

రేపు చంద్రగ్రహణం(Lunar eclipse)కంటే 9 గంటల ముందే ఉ.8.10 గంటలకు సూతకాలం ప్రారంభమవుతుంది. అనంతరం సా.6.19 గంటలకు ముగుస్తుంది. గ్రహణం సా.5.32 నుంచి 6.19 వరకు ఉంటుంది. కాబట్టి ఉదయం 8గంటలకు ముందే పూజలు పూర్తి చేసుకోవాని పండితులు చెబుతున్నారు. అయితే అసలు గ్రహణాల సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదవాల్సిందే.

దేవాలయాలను మూసివేయటానికి చాలా కారణాలు ఉన్నాయని గ్రణాలను నమ్మేవారు చెప్తుంటారు. తల్లి గర్భం అత్యంత పవిత్ర స్థలం.. ఎందుకంటే అందులోనే కొత్త జీవి ప్రాణం పోసుకోవటంతో ఒక సృష్టి జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే గర్భగుడిలోనూ దేవుడు ఉంటాడు. దేవుడు కూకడా సృష్టి కర్తే కాబట్టి.. తల్లి గర్భాన్ని ఏవిధంగా కాపాడుకుంటామో.. గర్భాలయాన్ని అలాగే కాపాడుకోవాలి. ఎందుకంటే గ్రహణం సమయంలో దుష్ట శక్తుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని నమ్ముతారు. ఈ కారణంతోనే గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేస్తారని ప్రముఖ ఆస్ట్రాలజర్‌ డాక్టర్‌ సీవీబీ సుబ్రమణ్యం ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉండే శ్రీకాళహస్తి, సంగమేశ్వర ఆలయాలకు మాత్రం గ్రహణం ప్రభావం ఉండదని చెప్తారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివుడు పాము రూపంలో ఉండగా.. ఆయన శిరస్సుపై ఐదు తలల సర్పం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి నడుముకు నాగాభరణం ఉంటుంది. ఈ దేవాలయంలోనే రాహు,కేతువులు ఉంటారు. అందువల్లే ఈ క్షేత్రం రాహు,కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఏ గ్రహణమైనా.. సూర్యచంద్రులను కబళించేది రాహు కేతువులే. అందువల్లే ఇక్కడ ఆలయానికి రాహు,కేతువుల ప్రభావం ఉండదని పండితులు చెప్తున్నారు. అదే విధంగా సంగమేశ్వర ఆలయంలో గ్రహణం రోజున అరుణ హోమం నిర్వహించి.. గ్రహణం వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ నేత

ఏపీలో ఎన్నికల వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది....

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ.. ఆ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం..

దేశవ్యాప్తంగా ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోండగా.. మరోవైపు ఓ నియోజకవర్గంలోఎన్నికలు...