Solar eclips: గ్రహణంమైనా తెరిచి ఉండే రెండు ఆలయాలు

-

Solar eclips: నేడు భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం అరుదైనదని 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని శాస్రవేతలు చెబుతున్నారు. సాయంత్రం 4.29 నుంచి గ్రహణకాలం ప్రారంభం కాగా.. గరిష్టంగా గంట 45 నిమిషాల పాటు గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ పాక్షిక గ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని, తిరుమల, విజయవాడ, శ్రీశైలం, యాదాద్రి, భద్రాచలం సహా పలు ప్రముఖ ఆలయాలను మూసివేశారు.

- Advertisement -

కానీ ఈ సమయంలో ఏపీలో రెండు ఆలయాలు తెరిచి ఉంటాయి. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం, కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయలను ఏ గ్రహణం వచ్చినా తెరిచే ఉంచుతారు. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వెలిసిన వాయులింగేశ్వరున్ని, సూర్యచంద్రాగ్నిలోచనుడు అంటారు. ఈ క్షేత్రనికి రాహు, కేతువుల ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో తెరిచి ఉంచే రెండవ ఆలయం సంగమేశ్వర ఆలయం. సూర్య గ్రహణ (Solar eclips) సమయంలో ఈ ఆలయంలో అరుణ హోమం నిర్వహించి.. గ్రహణం వేళ ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. నీరు లేని సమయంలో మాత్రమే భక్తులు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

Read also: అధికార పార్టీపై జనసేన వ్యంగ్య కార్టున్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...