Why saturday is special to lord venkateswara swamy: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి అని చాలా మంది ఆ శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శనివారం మరింత ప్రత్యేకంగా కొలుస్తారు. ఉపవాసాలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఏడుకొండల వాడిని శనివారమే ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విశేషం గురించి తెలుసుకుందాం.
ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం. ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే. వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే. అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం.