దసరా పండుగా ఎందుకు జరుపుకోవాలో తెలుసా…!

దసరా పండుగా ఎందుకు జరుపుకోవాలో తెలుసా...

0
157

దసరా పండుగ… ఈ పండుగను ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలు పెద్దల పండుగగా జరుపుకుంటారు…. అలాగే సంవత్సరంలో మొదటి పండుగా భావిస్తారు… ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ముఖ్యంగా రాయలసీమలో అయితే ఈ పండుగ రోజు తమ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు బట్టలు పెట్టి వారికి పూజ చేస్తారు… కుటుంబంలో చనిపోయిన వ్యక్తి గతంలో ఏవైతి ఇష్టపడిన వాటిని సమాదివద్ద ఉంచి వస్తారు… ఇలా ప్రతి ఏట తమ కుటుంబ సభ్యలును తలచుకుంటు వారిని గౌరవిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే… తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.

ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు,