ఈమధ్య కాలంలో ఫ్రిజ్ వాడని ఫామిలీస్ చాలా అరుదు అనే అనాలి. దాదాపు అందరి ఇళ్లలోనూ ఫ్రిజ్ వాడకం చాలా కామన్ అయిపోయింది. ఈ ఫ్రిజ్ వలన కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, అందులో పెట్టకూడనివి పెడితే నష్టం కలగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ లో కొన్ని ఆహార పదార్థాలు అస్సలు పెట్టొద్దని సూచిస్తున్నారు. ఇప్పుడు ఫ్రిజ్ లో ఏయే పదార్థాలు పెట్టకూడదో తెలుసుకుందాం.
గుడ్లను ఫ్రిజ్ లో పెడితే పాడవుతాయి. నీరు పెంకులపై చేరి పగుళ్లు ఏర్పడి బ్యాక్టీరియా ఈజీగా లోపలికి వెళ్తుంది.
పండ్లను ఫ్రిజ్ లో పెట్టొద్దు. వీటిలో అధికంగా ఉండే నీరు ఫ్రీజింగ్ అయి రుచి మారుతుంది.
బంగాళదుంపలు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల త్వరగా కుళ్ళిపోతాయి.
కీర దోసకాయలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్ లో పెట్టకండి
బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెట్టొద్దు. నీరు పీల్చుకుని వెంటనే పాడైపోతుంది.