Lunch Box Recipe | విద్యార్థులకు వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాయి. పిల్లలకు రుచికరమైన, పోషక ఆహార పదార్థాలు తయారు చేయడానికి అమ్మలు వంటింట్లో కుస్తీ పడుతున్నారు. తక్కువ టైమ్ లో, పోషకాలు ఉండేలా పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకునే అమ్మలకు హైదరాబాద్ దమ్ కిచిడీ బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు కిచిడీ తయారు చేసే విధానం తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:
బియ్యం – ఒక కప్పు
ఎర్ర పప్పు- ఒక కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి
పచ్చి మిర్చి ముక్కలు- పావు కప్పు
బిర్యానీ ఆకు-1
మిరియాలు- 6
షాజీరా- పావు టీస్పూన్
యాలకులు-3
దాల్చిన చెక్క- చిన్న ముక్క
అనాస పువ్వు- 1
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా
కరివేపాకు- రెండు రెమ్మలు
నెయ్యి లేదా నూనె – పావు కప్పు
కొత్తిమీర, పుదీనా తరుగు కొద్దిగా
Lunch Box Recipe | తయారీ విధానం:
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేయాలి. అది వేడయ్యాక బిర్యానీ ఆకు, మిరియాలు, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు అన్నింటినీ నూనెలో వేయించాలి. అవి కాస్త చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. కాస్తంత ఉప్పు వేసి మరో నిమిషం వేయించాలి. ఆ తర్వాత పప్పు, బియ్యం వేసి మొత్తం కలియతిప్పి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయే వరకు చిన్నమంటపై ఉడికించాలి. చివరగా కాస్తంత నెయ్యి జత చేస్తే సరి. రుచికరమైన కిచిడీ రెడీ.
Read Also:
1. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి
2. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat