Best Beauty Drink: ఈ ఒక్క డ్రింక్ తో మెరిసే చర్మం, జుట్టు మీ సొంతం

-

Home made best beauty drink for glowing skin and strong hair: చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం కోసం ఆరాటపడని అమ్మాయిలుంటారా? తరచూ కాకపోయినా ఫ్యామిలీ ఫంక్షన్స్, ప్రత్యేక ఈవెంట్స్ కోసం అయినా బ్యూటీపై స్పెషల్ ఫోకస్ పెడతారు. అయితే పైపైన అప్లై చేసే ఏవైనా సరే టెంపరరీ మెరుగుల్ని మాత్రమే ఇస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం లోపలికి తీసుకునే వాటివల్ల దీర్ఘకాలిక ఉపయోగాలుంటాయి అని చెబుతున్నారు. అందుకే వారు ఒక బ్యూటీ డ్రింక్ ని సజెస్ట్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ పదార్ధాలతో చేసుకునే ఈ డ్రింక్ సేవించడం వలన ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని వాదిస్తున్నారు.

- Advertisement -

ఈ డ్రింక్ తాగడం వలన రక్తం శుద్ధి అవుతుందట. శరీరానికి మేలు చేసే పోషక విలువలు అందుతాయట. తద్వారా అందంతోపాటు ఆరోగ్యం మన సొంతం అవుతుందట. చర్మం నిగారింపు సంతరించుకోవడం తో పాటు జుట్టు పొడవుగా, బలంగా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్యూటీ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు బీట్‌రూట్, ఉసిరి, అల్లం, కరివేపాకు, నీరు. వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంట. అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ డ్రింక్ తయారు చేసే విధానం ఎలానో తెలుసుకుందాం.

తయారీ విధానం:

ఒక బీట్ రూట్, 10 నుంచి 12 కరివేపాకులు, ఒక ఉసిరికాయ, ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం, అరకప్పు నీళ్లు తీసుకోవాలి. ముందు పీల్ చేసిన బీట్‌రూట్‌, కరివేపాకు, ఉసిరికాయ, అల్లం లను శుభ్రంగా కడగాలి. తర్వాత బీట్‌రూట్‌, ఉసిరికాయ, అల్లం లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. అవసరాన్ని బట్టి నీటిని యాడ్‌ చేయాలి. తర్వాత ఒక గిన్నె పైన మస్లిన్‌ గుడ్డను వేసి, ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. ఫిల్టర్‌ అయిన ఆ జ్యూస్‌ తాగడానికి రెడీ అయినట్లే(Best Beauty Drink). దీన్ని నేరుగా తాగొచ్చు. కావాలంటే కొద్దిగా తేనె యాడ్ చేసుకోవచ్చు.

Read Also:

ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్… 

అశోక్ గజపతిరాజు తో చంద్రబాబు.. మంత్రి బొత్సను చూడమంటూ సవాల్

హ్యాపీ లైఫ్ కోసం ఈ 12 రూల్స్ పాటించాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...