Chicken pickle కి కావలసిన పదార్థాలు: చికెన్ – పావు కేజీ, వెనిగర్- రెండు టేబుల్ స్పూన్లు, మెంతి పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం- ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు, నూనె – తగినంత, పసుపు- రెండు టీస్పూన్లు
నిమ్మరసం – ఒక కప్పు, ఆవాలు- రెండు టీస్పూన్లు, ఆవాల పొడి – రెండు టీస్పూను
Chicken pickle తయారీ విధానం: ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ వేసి వెనిగర్, కొద్దిగా నీళ్లు పోసి ఒక ఐదు ఉడికించాలి. తర్వాత నీళ్లు వంపేసి ఆ చికెన్ ముక్కలను తీసి పక్కన పెట్టాలి. ఒక కడాయిలో నూనె వేసి కాస్త వేడయ్యాక చికెన్ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఒక పాత్రలో మెంతిపొడి, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టాలి. మరొక పాన్లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత చికెన్ ముక్కలు వేయాలి. మెంతిపొడి మిశ్రమం వేయాలి. బాగా కలిపి కాసేపు చిన్నమంటపై ఉంచి దించేయాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. (వచ్చే వారం ఎక్కువ రోజులు నిల్వ ఉండే చికెన్ పచ్చడి ఎలా చేయాలో Alltimereport.com లో తెలుసుకుందాం).